'కాంగ్రెస్ గెలిస్తే.. నేనే సీఎం' | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ గెలిస్తే.. నేనే సీఎం'

Published Fri, Jun 24 2016 3:07 PM

'కాంగ్రెస్ గెలిస్తే.. నేనే సీఎం' - Sakshi

హాలియా (నల్లగొండ) : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తానే ముఖ్యమంత్రి పదవిని చేపడతానని తెలంగాణ శాసనసబ ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా హాలియాలో శుక్రవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణ రాష్ట్రం తెచ్చిందీ కాంగ్రెస్సేనని  అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సీఎంతోపాటు సమాన హోదా కలిగిన ఏకైక నాయకుడిని తానే అని అన్నారు.

Advertisement
 
Advertisement