సంబరాల్లో బాలీవుడ్ హీరో | It's a Girl For Shahid Kapoor, Mira Rajput | Sakshi
Sakshi News home page

సంబరాల్లో బాలీవుడ్ హీరో

Aug 27 2016 1:51 PM | Updated on Sep 4 2017 11:10 AM

సంబరాల్లో  బాలీవుడ్  హీరో

సంబరాల్లో బాలీవుడ్ హీరో

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, మీర్జా రాజ్‌పుత్ దంపతులు సంబరాల్లో మునిగిపోతున్నారు. షాహిద్ భార్య మీర్జా శుక్రవారం సాయంత్రం ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు సంబరాల్లో మునిగిపోతున్నారు. షాహిద్ భార్య మీరా శుక్రవారం సాయంత్రం ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  తండ్రిగా ప్రమోషన్ పొందిన షాహిద్ ట్విట్టర్ లో అభిమానులతో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. అటు ఈ దంపతుల   కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. తమ కుటుంబంలోకి వచ్చి చేరిన బుజ్జిపాపాయిని ఆనందంగా ఆహ్వానించడానికి అటు కుటుంబ సభ్యులు  ఇటు  నటులు పంకజ్ పాథక్, సుప్రియా పాథక్ తదితరులు  హుటా హుటిన  ఆసుపత్రికి తరలి వెళ్ళారు.  బాలీవుడ్  హీరోహీరోయిన్లు,  పరిశ్రమకు  చెందినపలువురు షాహిద్ ను అభినందనల్లో ముంచెత్తారు. దియామీర్జా ,  అనుష్క శర్మ, అజయ్  దేవగన్, ఫరిఖాన్ తదితరులు ఈ కోవలో ఉన్నారు.

మరవైపు షాహిద్ మీర్జా దంపతులకు ట్విట్టర్ లో అభినందనల వెల్లువ కురుస్తోంది. దీంతో తమకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు తెలియచేస్తూ ట్వీట్ చేశారు.  తమకెంతో ఆనందంగా ఉందని, ఆ సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతున్నానంటూ ట్వీటారు  షాహిద్.
కాగా  హైదర్ చిత్రంతో ఉత్తమ నటుడి అవార్డు గెల్చుకున్న   షాహిద్ గత ఏడాది జులైలో  ఢిల్లీ కిచెందిన మీరాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement