అలా అయితే చాలా ట్రబులే: ట్రంప్ | it is indeed a big trouble, says donald trump | Sakshi
Sakshi News home page

అలా అయితే చాలా ట్రబులే: ట్రంప్

Feb 4 2017 6:43 PM | Updated on Apr 4 2019 5:04 PM

అలా అయితే చాలా ట్రబులే: ట్రంప్ - Sakshi

అలా అయితే చాలా ట్రబులే: ట్రంప్

ఏడు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ మీద అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ స్పందించారు.

ఏడు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ మీద అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ స్పందించారు. ఈ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం మీద అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన మాత్రం తన మాటకే కట్టుబడ్డారు. మధ్యలో ఒక్కసారి మాత్రం గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చినా, నిషేధం యథాతథంగా ఉంటుందన్నారు. 
 
ఒక దేశంలోకి ఎవరు రావాలో, ఎవరు రావద్దో చెప్పలేనప్పుడు.. అందులోనూ అది భద్రతా కారణాలకు సంబంధించి అయినప్పుడు అది చాలా పెద్ద ట్రబుల్ అవుతుందని తాజాగా ట్వీట్ చేశారు. ఇంతకు ముందు ఇరాన్ అణుపరీక్షలు నిర్వహించడం మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఆ దేశం మీద ఆంక్షలు విధించాల్సి వస్తుందన్న విషయాన్ని సైతం ట్విట్టర్ ద్వారానే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రావెల్ బ్యాన్ గురించి మాట్లాడారు. 
 
ఒక జడ్జి తన నిర్ణయాన్ని తప్పుబట్టడంపై కూడా ఆయన మండిపడ్డారు. దేశం నుంచి శాంతిభద్రతలను తరిమేయాలనుకుంటున్నారని, ఆయన నిర్ణయం పనికిమాలినదని, దాన్ని కొట్టిపారేస్తామని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాలు కూడా ట్రావెల్ బ్యాన్‌తో ఏకీభవించాయని, కొంతమందిని దేశంలోకి అనుమతిస్తే అది మరణం, విధ్వంసమే అవుతుందన్న విషయం వారికి తెలుసని చెప్పారు. తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా సరైన కవరేజి ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక మాత్రం ఇప్పటికీ ఆ విషయం తెలుసుకోవట్లేదన్నారు.
 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement