breaking news
big trouble
-
బీఆర్ శెట్టి అన్ని దొంగ లెక్కలే చూపించారు
సాక్షి, అమరావతి : భవగుత్తు రఘురామ్ శెట్టి అలియాస్ బీఆర్ శెట్టి... అబుదాబీలో స్థిరపడిన భారతీయ సంపన్నుడు... ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాడు. గత ప్రభుత్వ హయాంలో ఆయన అమరావతిలో వంద ఎకరాల్లో బీఆర్ఎస్ మెడిసిటీ హెల్త్‌కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్, కృష్ణా నది మధ్య ఉన్న ద్వీపాల్లో భారీ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేస్తానని ప్రతిపాదనలు పంపారు. ధనవంతుడైన బీఆర్ శెట్టి తనను చూసి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారంటూ మాజీ సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే బీఆర్ శెట్టి అన్నీ దొంగ లెక్కలే చూపించారంటూ ‘మడీ వాటర్స్’ సంస్థ బయటపెట్టింది. 70 శాతం క్షీణించిన షేర్ ధరలు : ఎన్ఎంసీ హెల్త్‌కేర్ పేరుతో అబుదాబీతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల బీఆర్ శెట్టి ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఈ సంస్థను ఏకంగా లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్ కూడా నమోదు చేశారు. అయితే ఈ సంస్థ ప్రకటిస్తున్న ఆదాయ వ్యయాలపై ఓ కన్నేసి ఉంచిన ప్రముఖ షార్ట్ సెల్లింగ్ (షేర్ల పతనంపై అంచనా వేస్తుంది) సంస్థ ‘కార్సన్ బ్లాక్’ అసలు విషయం తేల్చమంటూ మడీ వాటర్స్‌కు బాధ్యతలు అప్పచెప్పింది. ఇందులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. బీఆర్ శెట్టి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని, చివరికి తన వాటాగా ఉన్న షేర్లను బ్యాంకులకు తనఖా పెట్టడమే కాకుండా, ఇతర భాగస్వాములకూ వాటాలు విక్రయించిన విషయాన్ని వెల్లడించింది. విదేశీ సంస్థలను అధిక ధరకు కొనుగోలు చేసినట్లుగా అకౌంట్స్‌లో చూపించారని, ఖాతాల్లో నగదు నిల్వలను ఎక్కువ చేసి చూపారని పేర్కొంది. వాస్తవ రుణాలను కూడా తక్కువ చేసి చూపిన వైనాన్ని బయటపెట్టింది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఎన్ఎంసీ షేరు ధర సుమారు 70 శాతం క్షీణించింది. దీంతో తనఖా పెట్టిన షేర్లను ఫస్ట్ అబుదాబీ బ్యాంక్, ఫాల్కన్ ప్రైవేట్ బ్యాంకులు అమ్మేశాయి. ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో రెండు రోజుల క్రితం చైర్మన్ పదవి నుంచి బీఆర్ శెట్టి తప్పుకున్నారు. -
అలా అయితే చాలా ట్రబులే: ట్రంప్
ఏడు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ మీద అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ స్పందించారు. ఈ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం మీద అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన మాత్రం తన మాటకే కట్టుబడ్డారు. మధ్యలో ఒక్కసారి మాత్రం గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చినా, నిషేధం యథాతథంగా ఉంటుందన్నారు. ఒక దేశంలోకి ఎవరు రావాలో, ఎవరు రావద్దో చెప్పలేనప్పుడు.. అందులోనూ అది భద్రతా కారణాలకు సంబంధించి అయినప్పుడు అది చాలా పెద్ద ట్రబుల్ అవుతుందని తాజాగా ట్వీట్ చేశారు. ఇంతకు ముందు ఇరాన్ అణుపరీక్షలు నిర్వహించడం మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఆ దేశం మీద ఆంక్షలు విధించాల్సి వస్తుందన్న విషయాన్ని సైతం ట్విట్టర్ ద్వారానే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రావెల్ బ్యాన్ గురించి మాట్లాడారు. ఒక జడ్జి తన నిర్ణయాన్ని తప్పుబట్టడంపై కూడా ఆయన మండిపడ్డారు. దేశం నుంచి శాంతిభద్రతలను తరిమేయాలనుకుంటున్నారని, ఆయన నిర్ణయం పనికిమాలినదని, దాన్ని కొట్టిపారేస్తామని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాలు కూడా ట్రావెల్ బ్యాన్‌తో ఏకీభవించాయని, కొంతమందిని దేశంలోకి అనుమతిస్తే అది మరణం, విధ్వంసమే అవుతుందన్న విషయం వారికి తెలుసని చెప్పారు. తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా సరైన కవరేజి ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక మాత్రం ఇప్పటికీ ఆ విషయం తెలుసుకోవట్లేదన్నారు. When a country is no longer able to say who can, and who cannot , come in & out, especially for reasons of safety &.security - big trouble! — Donald J. Trump (@realDonaldTrump) 4 February 2017 Interesting that certain Middle-Eastern countries agree with the ban. They know if certain people are allowed in it's death & destruction! — Donald J. Trump (@realDonaldTrump) 4 February 2017 The opinion of this so-called judge, which essentially takes law-enforcement away from our country, is ridiculous and will be overturned! — Donald J. Trump (@realDonaldTrump) 4 February 2017 After being forced to apologize for its bad and inaccurate coverage of me after winning the election, the FAKE NEWS @nytimes is still lost! — Donald J. Trump (@realDonaldTrump) 4 February 2017