ఐనాక్స్కు ఫలితాల దెబ్బ | Inox Leisure shares tank 9 pc, post Q2 numbers | Sakshi
Sakshi News home page

ఐనాక్స్కు ఫలితాల దెబ్బ

Oct 28 2016 1:38 PM | Updated on Sep 4 2017 6:35 PM

ఐనాక్స్కు ఫలితాల దెబ్బ

ఐనాక్స్కు ఫలితాల దెబ్బ

ప్రముఖ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల నిర్వహణ సంస్థ ఐనాక్స్ లీజర్ఏకీకృత నికరలాభం భారీగా క్షీణించడంతో మార్కెట్ లో ఐనాక్స్ షేర్ దాదాపు 8.74శాతం పతనమైంది.

న్యూఢిల్లీ: ప్రముఖ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల నిర్వహణ సంస్థ ఐనాక్స్ లీజర్కు ఫలితాల షాక్ తగిలింది. మల్టీప్లెక్స్ ఆపరేటర్ ఐనాక్స్  ఏకీకృత నికరలాభం భారీగా క్షీణించడంతో మార్కెట్ లో  ఐనాక్స్ షేర్ దాదాపు 8.74  శాతం పతనమైంది.  సెప్టెంబర్ ముగిసిన  రెండవ త్రైమాసికంలో సంస్థ నికర లాభాలు  92. 56 శాతం  క్షీణించాయి. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో  రూ 1.58 కోట్లు  ఏకీకృత నికరలాభం  సాధించినట్టు బీఎస్ఈ ఫైలింగ్ లో నివేదించింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్లో రూ 21.24 కోట్లగా ఉంది.  నికర అమ్మకాలు  3.12 శాతం  తగ్గి రూ 279 కోట్లుగా  రిపోర్ట్ చేసింది.  గత ఏడాది ఇదే కాలంలో రూ 288 కోట్లుగా ఉంది.

కాగా ఐనాక్స్ లీజర్ 57 నగరాల్లో మొత్తం 440  స్ర్కీన్స్ నిర్వహిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement