షీనా బోరా హత్యకు కారణాలు నాకు తెలుసు! | Indrani Mukerjea's Son Says He Knows Why She Killed Sheena | Sakshi
Sakshi News home page

షీనా బోరా హత్యకు కారణాలు నాకు తెలుసు!

Aug 27 2015 8:29 AM | Updated on Jul 30 2018 8:29 PM

షీనా బోరా హత్యకు కారణాలు నాకు తెలుసు! - Sakshi

షీనా బోరా హత్యకు కారణాలు నాకు తెలుసు!

గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది.

గౌహతి: గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.  షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ పాత్ర గురించి మరిన్ని విషయాలు బయటపెడతానంటున్నాడు కొడుకు మిఖైల్ బోరా.  తన సోదరిని తల్లి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తెలుసంటున్నాడు. అయితే పోలీసుల ముందు తల్లి నేరాన్ని ఒప్పకోకపోతే మాత్రం తాను మాత్రం సాక్షిగా మారతానని తెలిపాడు. 

 

'నా సోదరిని తల్లే హత్య చేసిందని నేను నమ్ముతున్నా. అందుకు సంబంధించి పూర్తి కారణాలు నాకు తెలుసు. ఒక కారణం అయితే కాదు. చాలా కారణాలే ఉన్నాయి. ఆమె నేరాన్ని అంగీకరించని పక్షంలో.. నేను ఏది చేయాల్సిన అవసరం వస్తుందో అది కచ్చితంగా చేస్తా.ఆగస్టు 31 వరకూ ఇంద్రాణికి పోలీస్ కస్టడీ విధించారు. వారి విచారణలో  నేరాన్ని ఒప్పుకోకపోతే మాత్రం ఆ హత్య గల కారణాలను చెబుతా'అని మిఖైల్ బోరా తెలిపాడు.

 

2012లో హత్యకు గురైన షీనా బోరా కేసులో టీవీ మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణిని బుధవారం అరెస్టు చేశారు.  స్టార్ ఇండియా 2002లో  స్టార్ ఇండియా సీఈఓగా పీటర్ ఉన్నప్పుడు ఇంద్రాణిని పెళ్లాడాడు. అంతకుముందే ఇద్దరికీ జరిగిన వివాహాలకు విడాకులూ అయ్యాయి. అయితే ఆమెకు సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నాలతో తనకు జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని పీటర్ దగ్గర దాచింది. అనంతరం చోటు చేసుకున్నపరిణామాలు కూతురు షీనా బోరా హత్యకు దారి తీశాయి. ఆ విషయాన్ని దాచి పెట్టిన ఇంద్రాణి.. షీనా అమెరికాకు వెళ్లినట్లు అందర్నీనమ్మించింది. ఈ హత్య కేసులో ఇంద్రాణి పాత్ర ఉందని తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement