దేశంలోనే తొలి ఏసీ డెము రైలు ప్రారంభం | India's first air-conditioned DEMU train launched in Kochi | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలి ఏసీ డెము రైలు ప్రారంభం

Jun 22 2015 4:24 AM | Updated on Sep 3 2017 4:08 AM

దేశంలోనే తొలి ఏసీ డీజిల్ ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్(డీఈఎంయు) రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆదివారం కేరళలో..

కొచ్చి: దేశంలోనే తొలి ఏసీ డీజిల్ ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్(డీఈఎంయు) రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆదివారం కేరళలో ప్రారంభించారు. అంగమలై-ఎర్నాకుళం-త్రిపునితుర-పిరవోం మార్గంలో నడిచే ఈ రైలులో ఏసీ సౌకర్యం కూడా కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు సౌకర్యం ద్వారా పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రైళ్లను మరిన్నింటిని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. ఏసీ కోచ్‌లో 75 మంది కూర్చునే విధంగా సీట్లు అమర్చినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement