కొత్త నోట్లు ప్రెస్ల నుంచి డైరెక్ట్గా ఇంటికే!

కొత్త నోట్లు ప్రెస్ల నుంచి డైరెక్ట్గా ఇంటికే!

రోజుల తరబడి క్యూలైన్లో నిల్చున్నా బ్యాంకుల్లో నగదు దొరకడం లేదు.. కొంతమంది దగ్గరైతే కోట్లకు కోట్లు కొత్త నోట్లు దర్జాగా వచ్చేస్తున్నాయి. ఇదంతా ఏమిటి? వారందరికీ కొత్త నోట్లు ఎలా దొరుకుతున్నాయి. మనం ఎన్నిరోజులు నిల్చున్న మనకెందుకు దొరకట్లేదు. కొందరి బ్యాంకు అధికారులు మతలబుతో పాటు ఇంకేమైనా గందరగోళం ఉందా? ఇవన్నీ పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజల నుంచి వస్తున్న సందేహాలు. వారి సందేహాలకు ఆజ్యం పోస్తూ తాజాగా ఆదాయపు పన్ను శాఖ కూడా పెద్ద ఎత్తున్న కొత్త నోట్లు కొందరి వద్దే దొరుకుతుండటంపై అనుమానాలు వ్యక్తంచేస్తోంది.  పెద్ద ఎత్తున్న కొత్త నోట్లు ప్రభుత్వ ముద్రణా సంస్థలు, ఆర్బీఐ నుంచే డైరెక్ట్గా కొందరి ఇళ్లకు చేరినట్టు ఐటీ అనుమానిస్తోంది. దీనిపై ఆదాయపు పన్ను శాఖ, ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ ప్రారంభించాయి. 

 

హిందుస్తాన్ టైమ్స్ రిపోర్టు ప్రకారం మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్కు చెందిన రెండు ప్రభుత్వ కరెన్సీ ప్రెస్ ముద్రణ వేసి ఉన్న రూ.20 లక్షల కొత్త 2000 రూపాయి నోట్లు గతనెలా ఢిల్లీలో పట్టుబడ్డాయి. ఇవి పట్టుబడిన అనంతరం వెంటనే ఐటీ శాఖ, మద్రణ సంస్థ నుంచి కొత్త నోట్లు ఇలా ఎ‍క్కడికి వెళ్తున్నాయ్ అనే దిశగా విచారణ ప్రారంభించింది. ఈ నగదు పట్టుబడింది ఓ కొరియర్ బాయ్ దగ్గర. అతని పేరు కృష్ణ కుమార్గా అధికారులు గుర్తించారు. డిసెంబర్ 15న గ్రేటర్ కైలాష్-1 ఎం బ్లాక్ మార్కెట్లో వేచిచూస్తుండగా అధికారులు ఇతన్ని పట్టుకున్నారు.

 

ముద్రణ సంస్థల సీల్తో ఉన్న నగదు పబ్లిక్లో పట్టుబడటం ఇదే మొదటిసారని ఇద్దరు సీనియర్ ఐటీ, ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు. ఒకవేళ ప్రింటింగ్ ప్రెస్, ఆర్బీఐ చెస్ట్లు తమ లొసుగులతో రాజీపడి ఇలాంటి కార్యకలాపాలేమైనా నిర్వహిస్తే,  ఆర్బీఐ కచ్చితంగా తమతో మరింత సమాచారం పంచుకోవాల్సి ఉంటుందని మరో అధికారి చెప్పారు. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు నగదు చేరవేస్తున్న నగదు నిర్వహణ కంపెనీల పాత్రపై కూడా ఐటీ, ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అధికారులు పట్టుకున్న ఆ బ్యాగులు సాల్బోని, నాసిక్ ప్రెస్లకు సంబంధించినవి. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఈ  రెండు ప్రెసింగ్ సంస్థలు రోజుకు 52 లక్షల పీస్ల నోట్లను ప్రింట్ చేస్తున్నాయి. 

 
Back to Top