ఇంతకన్నా గొప్ప 'రాఖీ' కానుక ఉండదేమో! | I love her, says Sachin his sister SakshiMalik, a #Rio2016 Bronze medallist | Sakshi
Sakshi News home page

ఇంతకన్నా గొప్ప 'రాఖీ' కానుక ఉండదేమో!

Aug 18 2016 11:28 AM | Updated on Sep 4 2017 9:50 AM

ఇంతకన్నా గొప్ప 'రాఖీ' కానుక ఉండదేమో!

ఇంతకన్నా గొప్ప 'రాఖీ' కానుక ఉండదేమో!

రాఖీ పండుగను జరుపుకొంటున్న తరుణంలోనే రెజ్లర్‌ సాక్షి మాలిక్ దేశంలో కొత్త ఆనందాన్ని నింపారు.

అన్నా-చెల్లెలి అనుబంధానికి రక్షగా నిలిచే రాఖీ పండుగను జరుపుకొంటున్న తరుణంలోనే రెజ్లర్‌ సాక్షి మాలిక్  దేశంలో కొత్త ఆనందాన్ని నింపారు. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టారు. తన సోదరి సాధించిన ఈ విజయంపై  సాక్షిమాలిక్ సోదరుడు సచిన్‌ రాధాకృష్ణన్‌ ఆనందం వ్యక్తం చేశారు. రాఖీ పండుగ సందర్భంగా ఇంతకన్నా గొప్ప కానుకను ఏ చెల్లి కూడా తన అన్నకు ఇచ్చి ఉండదంటూ ఆయన పేర్కొన్నారు.

పతకం గెలువాగానే తాను సాక్షికి రక్షాబంధన్‌ మెసేజ్‌ పంపించానని, ఒక అన్నగా ఆమెను తనకు ఎంత ఆప్యాయత ఉందో ఆ మెసేజ్‌లో తెలియజేశానని సచిన్ చెప్పారు. మరోవైపు సాక్షి మాలిక్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆమెను పెద్ద ఎత్తున అభినందిస్తూ.. మహిళా శక్తిని చాటిన సాక్షికి నీరాజనాలు పడుతున్నారు. ఆమె ప్రతిభను కీర్తిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement