హైదరాబాదీ సిరాజ్‌ వచ్చేశాడు.. | Hyderabad player Siraj joins SRH | Sakshi
Sakshi News home page

హైదరాబాదీ సిరాజ్‌ వచ్చేశాడు..

Apr 19 2017 8:23 PM | Updated on Sep 5 2017 9:11 AM

హైదరాబాదీ సిరాజ్‌ వచ్చేశాడు..

హైదరాబాదీ సిరాజ్‌ వచ్చేశాడు..

హైదరాబాద్ కు చెందిన యువకెరటం పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ .. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడనున్నాడు.

హైదరాబాద్‌: ఐపీఎల్‌-10లో భాగంగా ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. హైదరాబాద్ కు చెందిన యువకెరటం పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ .. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడనున్నాడు. సిరాజ్‌ను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు రూ.2 కోట్లు వెచ్చించిమరీ కొనుగోలుచేసిన సంగతి తెలిసిందే.
 
బుధవారం రాత్రి ఉప్పల్‌ స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడుతున్న తుది జట్టులో సిరాజ్‌కు స్థానం కల్పించడంపై స్థానిక క్రీడాభిమానులు ఆనందం వ్యక్తంచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement