భారీ బంగారం, విదేశీ నగదు సీజ్‌ | Huge gold and foreign currency Siege at Mumbai Airport | Sakshi
Sakshi News home page

భారీ బంగారం, విదేశీ నగదు సీజ్‌

Feb 25 2017 7:46 PM | Updated on Sep 5 2017 4:35 AM

ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారం విదేశీ కరెన్సీ పట్టుబడింది.

ముంబై: ముంబై  విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారం విదేశీ కరెన్సీ పట్టుబడింది.  అధికారుల సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా 5 కేజీల బంగారం పట్టుబడింది.    కస్టమ్స్‌ అధికారులు  శనివారం   నిర్వహించిన తనిఖీల్లో భాగంగా  ఓ వ్యక్తిని నుంచి ఈ బంగారాన్ని  స్వాధీనం చేసకున్నారు.  దీంతో పాటు  విదేశీ క‌రెన్సీ ని కూడా సీజ్‌ చేశారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై కస్టమ్స్  అధికారులు మీడియాతో మాట్లాడుతూ... ఓ ప్ర‌యాణికుడి నుంచి ఐదు కేజీల బంగారం, భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 1.77 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తుకొనసాగుతుందని వెల్లడించారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement