ఏయిర్ ఏసియా కలర్ ఫుల్ ఆఫర్ | Holi Sale: AirAsia India Offers All-Inclusive Tickets Starting Rs. 1,499 | Sakshi
Sakshi News home page

ఏయిర్ ఏసియా కలర్ ఫుల్ ఆఫర్

Mar 6 2017 5:25 PM | Updated on Sep 5 2017 5:21 AM

ఏయిర్ ఏసియా కలర్ ఫుల్ ఆఫర్

ఏయిర్ ఏసియా కలర్ ఫుల్ ఆఫర్

రంగుల వసంత కేళి సందర్భంగా ఏయిర్ ఏసియా కలర్ ఫుల్ ఆఫర్ ప్రకటించింది.

రంగుల వసంత కేళి సందర్భంగా ఏయిర్ ఏసియా కలర్ ఫుల్ ఆఫర్  ప్రకటించింది. హోళి పండుగ సందర్భంగా రూ.1,499కే విమాన టిక్కెట్ ధరలను విక్రయించనున్నట్టు పేర్కొంది. 2017 మార్చి 12 వరకు ఈ ఆఫర్ బుకింగ్స్ అందుబాటులో ఉండనున్నాయని టాటా సన్స్, మలేషియన్ క్యారియర్ ఏయిర్ ఏసియా జాయింట్ వెంచర్ తన వెబ్సైట్ లో వెల్లడించింది.
 
2017 జూన్ 30 వరకు ప్రయాణాలకు ఈ స్పెషల్ ఫేర్స్ వర్తించనున్నాయి. ఈ స్కీమ్ కింద  హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణాలకు అతి తక్కువ టిక్కెట్ ధర రూ.1,499కు(అన్ని ఛార్జీలు కలుపుకుని) అందుబాటులో ఉండనుంది. శ్రీనగర్, పూణే వంటి సుందర ప్రదేశాల్లో మీరు ప్రేమిస్తున్న వ్యక్తులతో రంగుల పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఏయిర్ ఏసియా ఓ ట్వీట్ కూడా చేసింది. 
 
ఈ ఆఫర్ కింద ఇతర రూట్స్ టిక్కెట్ ధరలు ఇలా ఉన్నాయి:
ఇంఫాల్-గోహతి మధ్య ప్రయాణాలకు రూ.1999
పూణే-జైపూర్ మధ్య ప్రయాణాలకు రూ.2,999
పూణే-బెంగళూరు, విశాఖపట్నం-బెంగళూరు మధ్య ప్రయాణాలకు రూ.2,399
దేశీయ మార్కెట్లో ఏయిర్ ఇండియా, ఇండిగో, జెట్ ఏయిర్ వేస్, స్పైస్ జెట్ లకు పోటీగా ఏయిర్ ఏసియా ఈ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలే ఈ ప్రత్యర్థి విమానయాన సంస్థలు కూడా డిస్కౌంటెడ్ టారిఫ్‌లను ప్రకటించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement