breaking news
AirAsia Offer
-
ఎయిర్ ఏసియా డిస్కౌంట్ సేల్: టిక్కెట్ ధరెంతంటే...
ముంబై : మలేషియా బడ్జెట్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ఎయిర్ ఏసియా విమాన టిక్కెట్లపై డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. తమ దేశీయ జాయింట్ వెంచర్ క్యారియర్ ఆపరేట్ చేసే దేశీయ మార్గాలకు టిక్కెట్ ధర రూ.1,099 నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. అదేవిధంగా గ్రూప్ ఎయిర్ లైన్స్ ఆపరేట్ చేసే అంతర్జాతీయ విమానాలకు టిక్కెట్ ధర రూ.2,999 నుంచి అందిస్తున్నట్టు పేర్కొంది. పరిమిత కాలవ్యవధిలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఏసియా తెలిపింది. ఎయిర్ ఏసియా ఇండియా ఆపరేట్ చేసే బెంగళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, గోవా, శ్రీనగర్, రాంచి, కోల్ కత్తా వంటి దేశీయ మార్గాలకు తక్కువగా 1,099కే టిక్కెట్ ధరలను అందుబాటులో ఉంచుతున్నామని ఎయిర్ ఏసియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద జూన్ 4 నుంచి జూన్ 11 మధ్యలో టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2018 జనవరి 15 నుంచి 2018 ఆగస్టు 28 మధ్యలో ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఏయిర్ ఏసియా బెంగళూరు, కొచ్చి, గోవా, చంఢీఘర్, పుణే, న్యూఢిల్లీ, గౌహతి, ఇంఫాల్, వైజాగ్, హైదరాబాద్, శ్రీనగర్, బాగ్డోగ్రా, కోల్ కత్తా, రాంచి ప్రాంతాలకు విమానాలు నడుపుతోంది. ఈ బిగ్ ప్రమోషన్ సేల్ ను ఆసియా, ఆస్ట్రేలియాలతోపాటు 120 మార్గస్థానాల ప్రయాణికులకు కనెక్ట్ చేసింది. కౌలాలంపూర్, బ్యాంకాంక్, ఫుకెట్, క్రాబి వంటి ఇంటర్నేషనల్ ప్రయాణాలకు కూడా అత్యంత తక్కువగా రూ.2999కే టిక్కెట్ ను అందిస్తోంది. ఈ ధరలు కూడా ఒకే ప్రయాణానికి మాత్రమేనని, దీనిలోనే అన్ని ఛార్జీలు కలిపి ఉంటాయిని ఎయిర్ ఏసియా పేర్కొంది. ఎయిర్ పోర్టు ఫీజు కూడా ఈ టిక్కెట్ ధరలోనే ఉంటుందని ఎయిర్ లైన్స్ తెలిపింది. ఎయిర్ ఏసియా పోర్టల్, తమ మొబైల్ యాప్ లో బుక్ చేసుకునే అన్ని బుకింగ్స్ కు ఈ బిగ్ సేల్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. -
ఏయిర్ ఏసియా కలర్ ఫుల్ ఆఫర్
రంగుల వసంత కేళి సందర్భంగా ఏయిర్ ఏసియా కలర్ ఫుల్ ఆఫర్ ప్రకటించింది. హోళి పండుగ సందర్భంగా రూ.1,499కే విమాన టిక్కెట్ ధరలను విక్రయించనున్నట్టు పేర్కొంది. 2017 మార్చి 12 వరకు ఈ ఆఫర్ బుకింగ్స్ అందుబాటులో ఉండనున్నాయని టాటా సన్స్, మలేషియన్ క్యారియర్ ఏయిర్ ఏసియా జాయింట్ వెంచర్ తన వెబ్సైట్ లో వెల్లడించింది. 2017 జూన్ 30 వరకు ప్రయాణాలకు ఈ స్పెషల్ ఫేర్స్ వర్తించనున్నాయి. ఈ స్కీమ్ కింద హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణాలకు అతి తక్కువ టిక్కెట్ ధర రూ.1,499కు(అన్ని ఛార్జీలు కలుపుకుని) అందుబాటులో ఉండనుంది. శ్రీనగర్, పూణే వంటి సుందర ప్రదేశాల్లో మీరు ప్రేమిస్తున్న వ్యక్తులతో రంగుల పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఏయిర్ ఏసియా ఓ ట్వీట్ కూడా చేసింది. ఈ ఆఫర్ కింద ఇతర రూట్స్ టిక్కెట్ ధరలు ఇలా ఉన్నాయి: ఇంఫాల్-గోహతి మధ్య ప్రయాణాలకు రూ.1999 పూణే-జైపూర్ మధ్య ప్రయాణాలకు రూ.2,999 పూణే-బెంగళూరు, విశాఖపట్నం-బెంగళూరు మధ్య ప్రయాణాలకు రూ.2,399 దేశీయ మార్కెట్లో ఏయిర్ ఇండియా, ఇండిగో, జెట్ ఏయిర్ వేస్, స్పైస్ జెట్ లకు పోటీగా ఏయిర్ ఏసియా ఈ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలే ఈ ప్రత్యర్థి విమానయాన సంస్థలు కూడా డిస్కౌంటెడ్ టారిఫ్లను ప్రకటించాయి.