దేశమంతా రంగేలీ! | holi clebrations | Sakshi
Sakshi News home page

దేశమంతా రంగేలీ!

Mar 25 2016 2:24 AM | Updated on May 28 2018 3:58 PM

దేశమంతా రంగేలీ! - Sakshi

దేశమంతా రంగేలీ!

దేశవ్యాప్తంగా గురువారం హోలీ సంబరాలు రంగులపండువగా సాగాయి.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గురువారం హోలీ సంబరాలు రంగులపండువగా సాగాయి. పార్టీల అధినేతలు, నాయకులు కార్యకర్తలతో కలసి సంబరాల్లో మునిగితేలారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలసి హోలీని జరుపుకున్నారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్ నివాసంలో కార్యకర్తలు అమిత్‌షాకు రంగులు పులిమి తమ సంతోషాన్ని తెలిపారు.  కాంగ్రెస్ కార్యాలయంలో సోనియాగాంధీ, రాహుల్‌లు వేడుకల్లో పాల్గొన్నారు. 


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో హోలీ సంబరాల్లో మునిగితేలారు.  పట్నాలోని అధికారిక నివాసంలో జేడీయూ  కార్యకర్తలతో కలసి సీఎం నితీశ్ కుమార్ హోలీ జరుపుకున్నారు. కాగా మెగాస్టార్ అమితాబ్ కుటుంబసభ్యుల హోలీ సంబరాల ఫొటోల్ని ట్విటర్‌లో పోస్ట్‌చేశారు. కెనడాలో ‘క్వాంటికో’ షూటింగ్‌లో ఉన్న ప్రియాంకాచోప్రా అక్కడే హోలీ జరుపుకున్నారు. ట్విటర్ పేజీలన్నీ బాలీవుడ్ తారల హోలీ ట్వీట్స్‌తో నిండిపోయాయి. గోవా, రాజస్థాన్‌లోని విదేశీ టూరిస్టులు హోలీ రంగుల్లో మునిగితేలారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement