తెలంగాణలో గోదావరి పుష్కరాలకు విస్తృత భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణలో గోదావరి పుష్కరాలకు విస్తృత భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో 106 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
భద్రాచలం, కరీంనగర్, బాసరలో ఐజీ స్థాయి అధికారులు భద్రత పర్యవేక్షిస్తారని అనురాగ్ శర్మ తెలిపారు. భారీ సంఖ్యలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.