మహిళలపై వ్యాఖ్యలకు నాన్న క్షమాపణలు చెప్పాలి: ఒమర్ అబ్దుల్లా | he must apologise: Omar Abdullah on father | Sakshi
Sakshi News home page

మహిళలపై వ్యాఖ్యలకు నాన్న క్షమాపణలు చెప్పాలి: ఒమర్ అబ్దుల్లా

Dec 6 2013 2:52 PM | Updated on Sep 2 2017 1:20 AM

మహిళలపై వ్యాఖ్యలకు నాన్న క్షమాపణలు చెప్పాలి: ఒమర్ అబ్దుల్లా

మహిళలపై వ్యాఖ్యలకు నాన్న క్షమాపణలు చెప్పాలి: ఒమర్ అబ్దుల్లా

మహిళలపై నాన్న ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా క్షమాపణలు చెప్పాలని జమ్మూ మరియు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.

జమ్మూ:మహిళలపై నాన్న ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా క్షమాపణలు చెప్పాలని జమ్మూ - కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. మహిళలను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోరాదంటూ కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరులశాఖ మంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. తండ్రి వ్యాఖ్యలపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఒమర్..  ఈ వ్యాఖ్యలు మహిళల రక్షణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. మహిళలపై ఫరూఖ్ చేసిన వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలు పంపకుండా ఉండాలంటే క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ వ్యాఖ్యలకు బ్లాగర్ల నుంచి విమర్శలు రావడంతో ఒమర్ స్పందించారు.

 

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గంగూలీ, ఇతర ప్రముఖులు లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకోవటంపై శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ ఫరూక్ ఈ వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారింది. ‘ఓ మహిళను కార్యదర్శిగా నియమించుకోరాదని నేను భావిస్తున్నా. కర్మకాలి ఏదైనా ఫిర్యాదు దాఖలైందంటే మేం జైలు పాలు కావాల్సిందే’ అని పార్లమెంట్ భవనం వద్ద ఆయన మీడియాతో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement