‘దళిత’ పద వినియోగం సమంజసమేనా? | HC seeks PCI reply on plea against use of word Dalit | Sakshi
Sakshi News home page

‘దళిత’ పద వినియోగం సమంజసమేనా?

Apr 28 2017 10:45 AM | Updated on Sep 5 2017 9:55 AM

‘దళిత’ పదాన్ని వినియోగించటంపై అభిప్రాయాన్ని తెలపాలంటూ పీసీఐని ఢిల్లీ హైకోర్టు కోరింది.

న్యూఢిల్లీ: సమాజంలో అసమతుల్యాన్ని సృష్టిస్తున్న ‘దళిత’ పదాన్ని వార్తా కథనాల్లో వినియోగించటంపై అభిప్రాయాన్ని తెలపాలంటూ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ)ని ఢిల్లీ హైకోర్టు కోరింది. పీసీఐ నిబంధనల ప్రకారం ‘షెడ్యూల్డ్‌ కులాలు’ అనే పదాన్ని కూడా వినియోగించటం నిషేధమని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతామిట్టల్, జస్టిస్‌ అను మల్హోత్రాల ధర్మాసనం తెలిపింది.

దళిత పదం వినియోగంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ఈ విషయంలో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రెస్‌ కౌన్సిల్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 19కి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement