అన్ని పార్టీలతో మంచి సంబంధాలున్నాయి: వెంకయ్య | Have good relations with all parties, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

అన్ని పార్టీలతో మంచి సంబంధాలున్నాయి: వెంకయ్య

May 27 2014 1:10 PM | Updated on Sep 2 2017 7:56 AM

అన్ని పార్టీలతో మంచి సంబంధాలున్నాయి: వెంకయ్య

అన్ని పార్టీలతో మంచి సంబంధాలున్నాయి: వెంకయ్య

తాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.

తాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... పార్లమెంట్లో అన్ని అంశాలపై మంచి చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మొట్టమొదటి కేబినెట్ సమావేశం ఉందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోలో తామిచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో తనకు మంచి సంబంధాలున్నాయని వెంకయ్య ఈ సందర్బంగా వివరించారు.


దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ భారత దేశ 15వ ప్రధానమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ కూటమీలోని పలువురు నాయకులు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎం.వెంకయ్యనాయుడుకు పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు రేపు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకయ్యనాయుడు కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement