breaking news
Minister of Parliamentary Affairs
-
28 నుంచి బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయన్నారు. లోక్సభ ఛాంబర్లో జరిగే ఉభయ సభల సభ్యుల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించడం సెషన్ మొదలవుతుందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేతోపాటు సాధారణ బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారని చెప్పారు. ఈ సెషన్ మొదటి దశ సమావేశాలు జనవరి 28– ఫిబ్రవరి 13వ తేదీ వరకు, రెండో దశలో మార్చి 9–ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉంటాయన్నారు. మధ్యలో ఫిబ్రవరి 13 నుంచి మార్చి 9 వరకు విరామం ఉంటుందన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం నాడు ప్రవేశపెట్టే బడ్జెట్ను గురించిన విషయాలను ఆయన వెల్లడించలేదు. -
అన్ని పార్టీలతో మంచి సంబంధాలున్నాయి: వెంకయ్య
తాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... పార్లమెంట్లో అన్ని అంశాలపై మంచి చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మొట్టమొదటి కేబినెట్ సమావేశం ఉందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోలో తామిచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో తనకు మంచి సంబంధాలున్నాయని వెంకయ్య ఈ సందర్బంగా వివరించారు. దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ భారత దేశ 15వ ప్రధానమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ కూటమీలోని పలువురు నాయకులు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎం.వెంకయ్యనాయుడుకు పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు రేపు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకయ్యనాయుడు కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.


