హర్యానా సీఎం హుడా విజయం | haryna chief minister bhupender singh hooda wins in haryana elecetions | Sakshi
Sakshi News home page

హర్యానా సీఎం హుడా విజయం

Oct 19 2014 11:47 AM | Updated on Mar 29 2019 9:24 PM

హర్యానా సీఎం హుడా విజయం - Sakshi

హర్యానా సీఎం హుడా విజయం

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, సీఎం భూపేందర్ సింగ్ హుడా విజయం సాధించారు.

చంఢీఘర్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, సీఎం భూపిందర్ సింగ్ హుడా విజయం సాధించారు. రోహతక్ జిల్లాలోని గార్హి కిలోయి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హుడా స్వల్ప మెజారిటీ గట్టెక్కారు. తొలుత వెనుకబడ్డ హుడా 3,500 ఆధిక్యంతో గెలిచారు. అయితే హర్యానాలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. హర్యానా అసెంబ్లీలో 90  సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది.

 

ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు స్థానాలను బీజేపీకి కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొలిసారి రాష్ట్రంలో పీఠాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీకి దాదాపు మార్గం సుగుమం అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement