పక్షులతో హ్యాపీ న్యూయర్ | Happy new year, says Google doodle | Sakshi
Sakshi News home page

పక్షులతో హ్యాపీ న్యూయర్

Dec 31 2015 11:42 AM | Updated on Sep 3 2017 2:53 PM

పక్షులతో హ్యాపీ న్యూయర్

పక్షులతో హ్యాపీ న్యూయర్

ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ విభిన్న 'డూడుల్'తో వీక్షకులకు ముందుగానే నూతన శుభాకాంక్షలు తెలిపింది.

న్యూఢిల్లీ: ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ విభిన్న 'డూడుల్'తో వీక్షకులకు ముందుగానే నూతన శుభాకాంక్షలు తెలిపింది. యానిమేటెడ్ డూడుల్ తో హ్యాపీ న్యూయర్ చెప్పింది. కొమ్మపై కూర్చున్న ఐదు పక్షులు 2016 పేరుతో ఉన్న గుడ్డును పొదిగేందుకు రాత్రి 12 గంటలు ఎప్పుడమవుతుందా అని చూస్తున్నట్టుగా డూడుల్ తయారు చేసింది.

గూగుల్ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ఈ డూడుల్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ వ్యక్తులు, ముఖ్య సంఘటనలకు సంబంధించిన వాటితో డూడుల్ రూపొందించి గూగుల్ తన వెబ్ సైట్ లో పెడుతున్న సంగతి నెట్ వీక్షకులకు సుపరిచితం.

Advertisement
 
Advertisement
Advertisement