గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది.. | Gujarath model fails due to riots, says Seetharam echuri | Sakshi
Sakshi News home page

గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది..

Aug 27 2015 10:37 AM | Updated on Mar 23 2019 9:10 PM

గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది.. - Sakshi

గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది..

గుజరాత్ మోడల్ ఫెయిల్ అయిందనడానికి ప్రస్తుత అల్లర్లే నిదర్శనమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు.

హైదరాబాద్: గుజరాత్ మోడల్ ఫెయిల్ అయిందనడానికి ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అల్లర్లే నిదర్శనమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ కుంభకోణాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వెనుకబాటుతనంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టకపోతే గుజరాత్లాంటి ఉద్యమాలు వస్తాయని హెచ్చరించారు.

కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కనబడటం లేదని సీతారాం ఏచూరి మండిపట్టారు. తమ పార్టీ ఇప్పటికే వైఎస్సార్సీపీ బంద్కు మద్దతు ప్రకటించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ల్యాండ్ పూలింగ్కు తాము వ్యతిరేకమని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement