
విమానయాన సంస్థల ఇండిపెండెన్స్ డే సేల్
ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిపెండెన్స్ డే సేల్ ధరలను ప్రకటించాయి.
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిపెండెన్స్ డే సేల్ ధరలను ప్రకటించాయి. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో తమ ప్రయాణికులకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందిస్తున్నాయి. ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో సహా ఎయిర్ ఇండియా బేస్ ఫెయిర్(ప్రాథమిక ఛార్జీలు)తో ప్రత్యేక తగ్గింపు చార్జీలను ప్రకటించాయి. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసుల్లో ఒక వైపు ప్రయాణానికి ఇండిగో దేశీయ సర్వీసుల్లో ఈ తగ్గింపు ధరలను వర్తింపచేస్తున్నాయి. అలాగే గ్రూప్ బుకింగ్ లకు ఈ ఆఫర్ వర్తించదు. స్టాట్యుటరీ పన్నులు మినహాయించి, ఈ ఛార్జీలు వాపసు ఇవ్వబడతాయని పేర్కొన్నాయి.
అలాగే గ్రూప్ బుకింగ్ లకు ఈ ఆఫర్ వర్తించదు. స్టాట్యుటరీ పన్నులు మినహాయించి తరువాత ఈ ఛార్జీలు వాపసు ఇవ్వబడతాయని పేర్కొన్నాయి. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15లోపు టికెట్లను బుక్ చేసుకోవాలి. అలాగే 22 ఆగస్టునుంచి సెప్టెంబర్ ముప్పయి లోపు వినియోగించుకోవాలి. అయితే లిమిటెడ్ సీట్లకు మాత్రమే ఉన్నాయని, ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ కింద సీట్లు కేటాయిస్తామని సంస్థలు ప్రకటించాయి.
ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా తగ్గింపు దేశీయ విమాన చార్జీలను 1199 నుంచి మొదలవుతుండగా, అంతర్జాతీయ ధరలు15,999 నుంచి ప్రారంభం. అంతర్జాతీయ టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు 15 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 15 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది.
బుకింగ్ వ్యవధి: 09 ఆగస్టు 2016 ఆగస్టు 15, 2016
దేశీయ ప్రయాణ వ్యవధి: - 22 ఆగష్టు -30 సెప్టెంబర్
అంతర్జాతీయ ప్రయాణం 15 సెప్టెంబర్ 15 డిసెంబర్, 2016
స్పైస్ జెట్
స్పైస్ జెట్ తగ్గింపు దేశీయ ప్రారంభ ధరలు రూ. 399 లుగాను ,అంతర్జాతీయ ధరలను రూ. 2999లు గాను నిర్ణయించింది.
బుకింగ్ వ్యవధి: 09 ఆగస్టు - ఆగస్టు 11 2016.
ప్రయాణ వ్యవధి: 18 ఆగష్టు - 30 సెప్టెంబర్ 2016.
అత్యల్ప ఒక వైపు ఛార్జీలు, లిమిటెడ్ సీట్లు. అలాగే విమానాల రాకపోకలు మరియు సమయాలు నియంత్రణ ఆమోదాలు తదితర మార్పుకు లోబడి ఉంటాయని స్పైస్ జెట్ ప్రకటించింది.
ఇండిగో
ఇండిగో రూ.806 (అన్ని కలుపుకొని) లనుంచి ప్రారంభమయ్యే దేశీయ విమాన ప్రయాణ ధరలు
బుకింగ్ వ్యవధి: 09 ఆగస్టు-ఆగస్టు 15 2016.
ప్రయాణ వ్యవధి: 18 ఆగష్టు- 30 సెప్టెంబర్ 2016
అన్నీ కలుపుకొని అత్యల్ప ఒక వైపు ఛార్జీలు, లిమిటెడ్ సీట్లు. క్లియర్ ట్రిప్ సైట్లో వివరాలు.