బాజ్పాయి వ్యాఖ్యలను అంగీకరించం: వెంకయ్య | Govt distances from UP BJP chief's controversial remarks | Sakshi
Sakshi News home page

బాజ్పాయి వ్యాఖ్యలను అంగీకరించం: వెంకయ్య

Sep 9 2014 11:04 PM | Updated on Sep 2 2017 1:07 PM

బాజ్పాయి వ్యాఖ్యలను అంగీకరించం: వెంకయ్య

బాజ్పాయి వ్యాఖ్యలను అంగీకరించం: వెంకయ్య

ముస్లింలపై ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్పాయి చేసిన వివాదస్పద వ్యాఖ్యలను అంగీకరించబోమని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: ముస్లింలపై ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్పాయి చేసిన వివాదస్పద వ్యాఖ్యలను అంగీకరించబోమని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. లక్ష్మీకాంత్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించలేమని స్పష్టం చేశారు. రేప్, తీవ్రవాదానికి మతం లేదని అన్నారు. అత్యాచారం, తీవ్రవాదం నేరాలని.. వీటిని నిర్మూలించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

ఒక మతానికి చెందిన పురుషులు వేరొక మతానికి చెందిన మహిళలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలకు పాల్పడుతున్నారని లక్ష్మీకాంత్  చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇలాంటి వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ కూడా అంగీకరించబోరని వెంకయ్య నాయుడు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement