రూ. 20 వేల కోట్లతో భారీ నౌకాదళ ప్రాజెక్టు! | Government gives green signal to build worth over Rs 20000 crore | Sakshi
Sakshi News home page

రూ. 20 వేల కోట్లతో భారీ నౌకాదళ ప్రాజెక్టు!

May 22 2017 11:29 AM | Updated on May 3 2018 3:20 PM

ప్రైవేటు రంగంలో నాలుగు ఉభయచర యుద్ధ నౌకల నిర్మాణానికి రక్షణ శాఖ ఓకే చెప్పింది.

న్యూఢిల్లీ: సుమారు రూ. 20వేల కోట్లకు పైగా వ్యయంతో ప్రైవేటు రంగంలో నాలుగు ఉభయచర యుద్ధ నౌకల నిర్మాణానికి రక్షణ శాఖ ఓకే చెప్పింది. దాదాపు 30వేల టన్నుల నుంచి 40 వేల టన్నుల సామర్థ్యంతో ఈ నౌకలు ఉండనున్నాయి. ప్రైవేటు రంగంలో చేపట్టనున్న అతిపెద్ద ప్రాజెక్టు కూడా ఇదే.

చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రెండు నౌకల నిర్మాణ బాధ్యతలను విశాఖపట్నంలోని హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌కు, మరో రెండు నౌకల బాధ్యతలను ఇతర సంస్థలకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement