క్షమాపణ చెప్పిన గూగుల్
టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టినందుకు ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ సంస్థ 'గూగుల్' క్షమాపణ చెప్పింది.
న్యూఢిల్లీ: టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టినందుకు ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ సంస్థ 'గూగుల్' క్షమాపణ చెప్పింది. గందరగోళం లేదా పొరపాటు కారణంగానే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆన్ లైన్ లో శోధించినప్పుడు అవాంఛిత ఫలితాలు రాకుండా ఉండేందుకు నిరంతరాయంగా పనిచేస్తున్నామని వెల్లడించింది. టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో మోదీ ఫోటో రావడంపై అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో వెంటనే స్పందించిన గూగుల్ దాన్ని తొలగించింది.


