
అసెంబ్లీని రద్దు చేసే ప్రశ్నే లేదు
గోవా అసెంబ్లీని రద్దు చేసే అవకాశం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు.
పణాజి: గోవా అసెంబ్లీని రద్దు చేసే అవకాశం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. మార్చి 11 వరకు ప్రస్తుత ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు.
గోవా అసెంబ్లీకి ఈ నెల 4న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 11న ఓటింగ్ జరుగుతుంది. కాగా భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఆరునెలలకు కనీసం ఒకసారైనా అసెంబ్లీ సమావేశం జరగాలి. గోవా అసెంబ్లీ సమావేశాలు చివరిసారిగా గతేడాది ఆగస్టు 26న జరిగాయి. కాబట్టి ఈ నెల 26వ తేదీలోపు మరోసారి అసెంబ్లీ సమావేశం కావాలి.
అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందును అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం లేదు. ఈ నేపథ్యంలో గోవా అసెంబ్లీని రద్దు చేసే అవకాశముందని అభిప్రాయాలు రావడంతో సీఎం పర్సేకర్ స్పందించారు. కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నామని, అసెంబ్లీని రద్దు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు.