ట్యూషన్కు వెళ్లి వస్తుంటే గ్యాంగ్ రేప్ | girl gangraped while coming from tution | Sakshi
Sakshi News home page

ట్యూషన్కు వెళ్లి వస్తుంటే గ్యాంగ్ రేప్

Jan 8 2015 2:32 PM | Updated on Sep 2 2017 7:24 PM

ట్యూషన్కు వెళ్లి వస్తుంటే గ్యాంగ్ రేప్

ట్యూషన్కు వెళ్లి వస్తుంటే గ్యాంగ్ రేప్

ఢిల్లీ శివార్లలో మరో ఘోరం జరిగింది. ఘజియాబాద్కు చెందిన 16 ఏళ్ల బాలిక ట్యూషన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

ఢిల్లీ శివార్లలో మరో ఘోరం జరిగింది. ఘజియాబాద్కు చెందిన 16 ఏళ్ల బాలిక ట్యూషన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. పదోతరగతి చదువుతున్న ఆ బాలిక.. ప్రైవేటుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా స్కార్పియో వాహనంలో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకున్నారు.

ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను ఆమె ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలు ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ట్యూషన్కు వెళ్తుంది. బాధితురాలు నిందితులను గుర్తించిందని పోలీసులు తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితులు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement