మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్ | Girl gang-raped, facebook boyfriend | Sakshi
Sakshi News home page

మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్

May 28 2015 11:54 PM | Updated on Jul 26 2018 5:23 PM

మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్ - Sakshi

మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్

నలుగురు వ్యక్తులు ఓ 14 ఏళ్ల బాలికను గ్యాంగ్‌రేప్ చేసిన ఘటన ధార్వానీ ప్రాంతంలో జరిగింది.

ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి కోసం బయలుదేరిన బాలిక
రైలు టికెట్ ఇప్పిస్తానని మోసం చేసిన ఉమేశ్
మిత్రులతో కలసి గ్యాంగ్‌రేప్


ముంబై: నలుగురు వ్యక్తులు ఓ 14 ఏళ్ల బాలికను గ్యాంగ్‌రేప్ చేసిన ఘటన ధార్వానీ ప్రాంతంలో జరిగింది. డిప్యూటీ కమిషనర్ మహేశ్ పాటిల్ వివరాల మేరకు... సబర్బన్ అంథేరీలో ఉండే బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. మే 24న ఫేస్‌బుక్ ద్వారా తనకు పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు జమ్మూ-కశ్మీర్‌కు వెళ్తానని వాళ్ల బామ్మకు బాలిక చెప్పగా, ఆమె వద్దని వారించింది.

ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగడంతో కోపంలో ఇంట్లోంచి వచ్చేసింది. బాలిక కుర్లా చేరుకున్న తర్వాత నిందితులు ఉమేశ్ కవడే (22), దినేష్ కుమార్ (20) తనకు కశ్మీర్ వెళ్లడానికి టికెటు ఇప్పిస్తామని చెప్పి ఛత్రపతి శివాజీ టర్మినస్ వద్దకు తీసుకెళ్లారు. తర్వాత టెకెట్ దొరకలేదని, తర్వాత రోజు ఇప్పిస్తామని, అప్పటి వరకు తమ ఇంట్లో ఉండమన్నారు.

నిందితులు అమ్మాయిని ఓ లెదర్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి, బలవంతంగా మందు తాగించి అత్యాచారం చేశారు. తరువాత సల్మాన్‌ఖాన్, రాజ్‌కుమార్ సింగ్‌కు ఫోన్ చేసి పిలిపించారు. వారు కూడా ఆమెను బలాత్కరించారు. మరుసటి రోజు వారిని గమనించిన జమీర్‌ఖాన్ అనే వ్యక్తి ఉమేశ్‌ను పట్టుకుని విషయం చెప్పాలని కొట్టడంతో ఉమేశ్ పరారయ్యాడు. దీంతో బాధితురాలిని బంధువుల వద్దకు జమీర్‌ఖాన్ చేర్చారు. నిందితుల్లో ముగ్గురిని పోలీ సులు అరెస్టు చేయగా.. ప్రధాన నిందితుడు ఉమేశ్ పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement