గిలానీకి పాస్‌పోర్ట్ జారీ | Gilani issued a passport | Sakshi
Sakshi News home page

గిలానీకి పాస్‌పోర్ట్ జారీ

Jul 22 2015 12:15 AM | Updated on Sep 3 2017 5:54 AM

కశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీకి తొమ్మిది నెలల కాలపరిమితితో మంగళవారం పాస్‌పోర్ట్ జారీఅయ్యింది. సౌదీలో

న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీకి తొమ్మిది నెలల కాలపరిమితితో మంగళవారం పాస్‌పోర్ట్ జారీఅయ్యింది. సౌదీలో అనారోగ్యం తో బాధపడుతున్న కూతురును చూసేందుకు వీలుగా తనకు పాస్‌పోర్ట్ కావాలని గిలానీ చేసుకున్న దరఖాస్తు సరిగా లేదనే కారణంతో 2 నెలల కిందట ప్రభుత్వం దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే.

గిలానీ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో హాజరై బయోమెట్రిక్ వివరాలను నమోదు చేశాక ఆయనకు పాస్‌పోర్ట్ జారీ అయింది. సాధారణంగా అయితే పదేళ్ల కాలపరిమితితో పాస్‌పోర్ట్ ఇస్తారు. గిలానీ పాస్‌పోర్ట్ మాత్రం 9 నెలలే చెల్లుబాటు అయ్యేలా జారీ అయింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement