రియల్టీ దిగ్గజానికి భారీ జరిమానా | For project delay, Supreme Court slaps builder Unitech with huge fine | Sakshi
Sakshi News home page

రియల్టీ దిగ్గజానికి భారీ జరిమానా

Feb 20 2017 6:33 PM | Updated on Sep 2 2018 5:28 PM

రియల్టీ దిగ్గజానికి భారీ జరిమానా - Sakshi

రియల్టీ దిగ్గజానికి భారీ జరిమానా

2010, జనవరి 1 నుంచి 39 మంది ఫ్లాట్‌ కొనుగోలు దారులకు సం.రానికి 14 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం యూనిటెక్‌ కు మరోసారి  దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  వినియోగ దారులుకు కేటాయించాల్సిన ఫ్లాట్స్‌  విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న డిల్లీ ఆధారిత నిర్మాణ సంస్థ  యూనిటెక్‌కు సుప్రీంకోర్టు భారీ జరిమానా విధించింది. యూనిటెక్‌ ప్రకటించినట్టుగా ఆరునెలలో ప్రాజెక్టు  పూర్తి చేయకపోవడంపై  సుప్రీం సీరియస్‌గా స్పందించింది.  ఈ నేపథ్యంలో సంస్థ ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు భారీ జరిమానా విధించింది.  2010, జనవరి 1 నుంచి 39 మంది ఫ్లాట్‌ కొనుగోలు దారులకు సం.రానికి 14 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని  సోమవారం ఆదేశించింది.  

ఫ్లాట్‌  కొనుగోలు కోసం 39మంది కొనుగోలుదారులు చెల్లించిన  రూ. 16.55 కోట్లపై ఈ వడ్డీ మొత్తాన్ని డిపాజిట్‌  చేయాలని  ఆదేశించింది.  అలాగే ఈ మొత్తంలో 90 శాతం నగదును  ఎనిమిది వారాల్లోపు చెల్లించాలని హర్యానాలోని  గుర్గాం​ యూనిటెక్‌  విస్టాస్ ప్రాజెక్ట్  యజమానులను ఆదేశించింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్  ఏ ఎం ఖాన్‌ మిల్కర్‌, జస్టిస్ మోహన్ ఎం శంతన్‌ గౌడర్‌ ఆధర్వంలో సుప్రీం ఈ తీర్పును వెలువరించింది.   ఈ సందర్భంగా ప్రజల  సొంత ఇంటి కలలతో  ఆడుకోవద్దంటూ రియల్టీ సంస్థలను సుప్రీం  బెంచ్‌ హెచ్చరించింది. ఒప్పంద నిబద్ధత గురించి  ప్రత్యేకంగా  ప్రస్తావించాల్సిన అవసరం లేదని  పేర్కొంది.   నమ్మకగా వ్యవహరిస్తూ  ప్రజల విశ్వాసాన్ని పొందడం చాలా అవసరమని సూచించింది.  అంతేకాదు ఏ ఆర్థిక  వ్యవస్థకైనా పునాది విశ్వాసమనీ..  ఆ విశ్వాసం కోల్పోతే,  సర్వం  కోల్పోయినట్టేనని ధర్మాసనం పేర్కొంది.



కాగా గత అక్టోబర్‌లో  విస్తా ప్రాజెక్టులోఫ్లాట్స్‌ కొనుగోలుచేసిన వారికి ఫ్లాట్స్‌  కేటాయించడంలో విఫలమైన యూనిటెక్‌ కు  చెందిన రియల్టర్లు  రూ.16.55 కోట్ల  మొత్తాన్ని 39మంది కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. అయితే ఆ సందర్భంగా యూనిటెక్‌ ప్రాజెక్టు  పూర్తికి  ఆరెనెలలు గడువు కావాలని కోరిన సంగతి తెలిసిందే.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement