ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్లో గడ్డి స్కాం విచారణను వేరే కోర్టుకు మార్చాలన్న ఆయన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్లో గడ్డి స్కాం విచారణను వేరే కోర్టుకు మార్చాలన్న ఆయన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణను వీలైనంత త్వరగా ముగించాలని దిగువ కోర్టును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ప్రాసిక్యూషన్ తన వాదనలను ముగించడానికి ఐదు రోజుల గడువు, తమ తరఫు వాదనలు వినిపించేందుకు నిందితులకు మరో పదిరోజుల గడువు ఇచ్చింది.
రాంచీ హైకోర్టు గానీ, సుప్రీంకోర్టు గానీ ఏం చెప్పాయన్న విషయంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా తన తీర్పు వెలువరించాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసు విచారణ ఎప్పుడో 2011లో మొదలైతే, ఇప్పుడు.. ఈ దశలో విచారణను వేరే కోర్టుకు మార్చాలని అడగడం ఏంటని లాలుప్రసాద్ను కూడా సుప్రీం నిలదీసింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన పీకే షాహి బీహార్ మం్రతి అని, ఆయన బంధువు ఒకరితో విచారణ కోర్టు న్యాయమూర్తికి వివాహం అయ్యిందని లాలు ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణలను సుప్రీంకోర్టు తిరస్కరించింది.