ఫ్లిప్కార్ట్కు భారీ షాక్ | Flipkart's losses double to Rs 2,306 crore in FY16 | Sakshi
Sakshi News home page

ఫ్లిప్కార్ట్కు భారీ షాక్

Nov 28 2016 12:41 PM | Updated on Sep 29 2018 4:44 PM

ఫ్లిప్కార్ట్కు  భారీ  షాక్ - Sakshi

ఫ్లిప్కార్ట్కు భారీ షాక్

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ షాక్ తగిలింది. ఫ్లిప్ కార్ట్ కు చెందిన మార్కెట్ యూనిట్, ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ భారీ నష్టాలను మూటగట్టుకుంది.

 ముంబై: ఈ కామర్స్  దిగ్గజం ఫ్లిప్ కార్ట్   భారీ షాక్ తగిలింది.  ఫ్లిప్ కార్ట్ కు చెందిన మార్కెట్ యూనిట్, ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్  భారీ నష్టాలను మూటగట్టుకుంది.   బెంగుళూరు ఆధారిత ఫ్లిప్  కార్ట్ ఇంటర్నెట్ ప్రయివేట్ లిమిటెడ్ 2016మార్చి31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను 110శాతం మేర  నష్టపోయింది. రెండింతల నష్టాన్ని నమోదు చేసింది.  సుమారు రూ 2,306 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది  ఇది రూ 1,096 కోట్లగా  ఉంది. ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ లో 99.74 శాతా వాటా కలిగి ఉంది.  దీంతో దేశంలో నెంబర్ వన్ స్థానంకోసం మరో దిగ్గజ కంపెనీ   అమెజాన్ తో హోరాహోరీగా పోరాడుతున్న ఫ్లిప్ కార్ట్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

Advertisement
 
Advertisement
Advertisement