మార్కెట్‌కు ‘ద్రవ్యోల్బణ’ దడ..!  | Sensex slipped 250 points to 72782, while the Nifty dropped 92 points to 22,559 | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు ‘ద్రవ్యోల్బణ’ దడ..! 

Oct 15 2026 4:41 AM | Updated on Oct 15 2026 4:41 AM

Sensex slipped 250 points to 72782, while the Nifty dropped 92 points to 22,559

పుంజుకున్న ముడిచమురు ధరలు 

ఆర్‌బీఐ కఠిన వైఖరి ఆందోళనలు 

252 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ 

99 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 

ముంబై: టోకు ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 11 శాతానికి చేరడంతో ఆర్‌బీఐ కఠినతర ద్రవ్య విధాన వైఖరిని కొనసాగిస్తుందనే ఆందోళనలతో బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర మళ్లీ 107 డాలర్లకు పెరగడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా సెన్సెక్స్‌ 252 పాయింట్లు నష్టపోయి 72,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 99 పాయింట్లు పతనమై 22,663 వద్ద నిలిచింది. ఉదయం బెంచ్‌మార్క్‌ సూచీలు ఫ్లాటుగా ప్రారంభమయ్యాయి. 

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 72,579 – 73,195 శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ 22,559 వద్ద కనిష్టాన్ని, 22,758 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఆర్‌బీఐ ‘ఫారెక్స్‌’ చర్యలతో పాటు ఎల్‌టీసీజీ, ఎస్‌టీటీ పన్నులపై సమీక్ష అంచనాలతో ప్రథమార్ధంలో సూచీలు లాభాల్లో కదలాడాయి. అయితే అంచనాలకు మించి నమోదైన టోకు ధరల ద్రవ్యోల్బణ డేటాతో ఆటో, ప్రైవేట్‌ బ్యాంక్, మెటల్స్‌ షేర్లలో లాభాల స్వీకరణ ఎదురైంది. దీంతో తొలి సెషన్‌లో ఆర్జించిన లాభాలను కోల్పోయి సూచీలు నష్టాలతో ముగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడికి ముందు అంతర్జాతీయ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.  

    బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో హౌసింగ్‌ ఫైనాన్స్‌ 1.12%, ఇన్సూరెన్స్‌ 1.04%, హెల్త్‌కేర్‌ 0.93%, ఆటో 0.87%, హాస్పిటల్స్‌ 0.82%, రియల్టీ 0.80%, టెలికమ్యూనికేషన్‌ 0.73 శాతం పతనమయ్యాయి. స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 0.72%, మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ 0.14 శాతం నష్టపోయాయి. మరోవైపు, వినియోగ, విద్యుత్, ఐటీ, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.  

నాలుగో రోజూ రూపాయి ర్యాలీ
నాలుగో రోజూ రూపాయి విలువ బలపడింది. డాలర్‌ మారకంలో 19 పైసలు పెరిగి నెల గరిష్టం 95.17 వద్ద స్థిరపడింది.  ‘‘స్పెక్యులేషన్లను అరికట్టేందుకు, స్వల్పకాలిక డాలర్‌ డిమాండ్‌ను తగ్గించేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు కలిసివచ్చాయి. అంతర్జాతీయంగా డాలర్‌ ఇండెక్స్‌ క్షీణత, అమెరికా బాండ్లపై రాబడులు తగ్గడం కూడా రూపాయి బలోపేతానికి దోహదపడ్డాయి. అయితే, ‘దేశీయ ఈక్విటీ మార్కెట్లలోని నష్టాలు’ భారతీయ కరెన్సీ లాభాలను కొంతవరకు పరిమితం చేశాయి’’ అని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు. కాగా, మొత్తం నాలుగు ట్రేడింగ్‌ సెషన్లో రూపాయి విలువ 171 పైసలు ర్యాలీ చేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement