చిన్న విమానం కూలి ఐదుగురు మృతి | Five killed in plane crash north of Denver | Sakshi
Sakshi News home page

చిన్న విమానం కూలి ఐదుగురు మృతి

Sep 1 2014 8:33 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

ఈరీ(యూఎస్): అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఉత్తర డెన్వర్ లో ఈ దుర్ఘటన జరిగినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. పైపర్ -46 విమానం ఈరీ మున్సిపల్ విమానాశ్రయానికి సమీపంలో కూలిపోయిందని తెలిపారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే చనిపోయాగా, ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు.

ఆరుగురు ప్రయాణించడానికి వీలుగా ఉండే ఈ విమానం కిందకు దిగుతున్నప్పుడు కూలిందా లేక పైకి ఎగురుతున్నప్పడు కూలిందా అనేది తెలియలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర డెన్వర్ కు ఈరీ ప్రాంతం 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement