వ్యవసాయ బావిలోపడి రైతు మృతి | Farmer dies to slip into farm well | Sakshi
Sakshi News home page

వ్యవసాయ బావిలోపడి రైతు మృతి

Aug 18 2015 7:42 PM | Updated on Oct 1 2018 3:56 PM

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి రైతు మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో మంగళవారం జరిగింది.

చింతకాని(ఖమ్మం జిల్లా): ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి రైతు మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన యల్లంపల్లి అప్పారావు (33) అను రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు.

వరి నాటు వేయించేందుకు పొలం వద్దకు వెళ్లిన రైతు మంచినీళ్లు తెచ్చేందుకు బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని సోదరుడు యల్లంపల్లి సీతారామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అప్పారావు నేత్రాలను అతని కుటుంబసభ్యులు నేత్రనిధికి దానం చేశారు. అప్పారావు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement