వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి కొట్టి చంపేసింది.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి కొట్టి చంపేసింది. ఈ ఘోర సంఘటన కాన్పూర్ సమీపంలోని బిధ్ను ప్రాంతంలో జరిగింది. ప్రేమ్ కుమార్ రాజ్పుత్ అనే ఆ రైతు అనారోగ్యంతో మరణించాడంటూ అతడి భార్య, ప్రధాన నిందితురాలు సంగీత అతడి మృతదేహాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తస్లీంపూర్లో నివసించే మృతుడి సోదరి తన సోదరుడి మృతిగురించి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దాంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపగా, శరీరం మీద గాయాలు కనిపించాయి. తర్వాత ఇంటి గోడలపై రక్తపు మరకలు కూడా కానవచ్చాయి. దాంతో సంగీతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తన ప్రియుడు అభిషేక్తో వివాహేతర సంబంధానికి నిరాకరించడంతో తామిద్దరం కలిసి భర్తను కొట్టి చంపినట్లు అంగీకరించింది.