ఏటీఎంలోంచి ‘తమాషా’ నోటు! | fake 500 hundred note in ATM | Sakshi
Sakshi News home page

ఏటీఎంలోంచి ‘తమాషా’ నోటు!

Mar 9 2017 9:39 AM | Updated on Sep 5 2017 5:33 AM

ఏటీఎంలోంచి ‘తమాషా’ నోటు!

ఏటీఎంలోంచి ‘తమాషా’ నోటు!

విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏటీఎంలో ఫుల్‌ ఆఫ్‌ ఫన్‌ పేరుతో రూ.500 నోటు రావడం కలకలం సృష్టించింది.

బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏటీఎంలో ఫుల్‌ ఆఫ్‌ ఫన్‌ పేరుతో రూ.500 నోటు రావడం కలకలం సృష్టించింది. ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న లైన్‌మన్‌ అంపావల్లి చిన్నారావు కరూర్‌ వైశ్య బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో డబ్బులు డ్రా చేశారు.

దానిలోంచి నకిలీ రూ.500 నోటు వచ్చింది. ఫన్‌తో పాటు దానిపై మనోరంజన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అని ఉంది. నోటు మీద ఉండే నంబర్లన్నీ సున్నాలుగానే ఉన్నాయి. నకిలీ నోట్లు, చిన్నారులు ఆడుకునే నోట్లు కూడా బ్యాంకు ఏటీఎంల నుంచి వస్తుండడంతో అందరూ విస్తుపోతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement