నయవంచకుడిని పట్టుకోండి!  | Victim Swathi Shocking Allegations On Kiran Bobbili, Alleges Cheated Her Of 30 Lakhs And Demands Immediate Arrest | Sakshi
Sakshi News home page

నయవంచకుడిని పట్టుకోండి! 

Mar 28 2026 9:55 AM | Updated on Mar 28 2026 12:32 PM

Victim Swathi Shocking Allegations on Kiran Bobbili

హైదరాబాద్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లోబరుచుకుని తన వద్ద రూ.30 లక్షలకు పైగా వాడుకుని మోసంచేసిన విజయనగరం పట్టణానికి చెందిన బొబ్బిలి సాయికిరణ్‌ను తక్షణమే అరెస్టుచేసి శిక్షించాలని బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తాను ఉద్యో గం నిమిత్తం చెన్నై వెళ్లగా సాయికిరణ్‌ పరిచయమయ్యాడని చెప్పింది. 

తనకు పెళ్లయి ఒక కూతురు ఉందని, భర్తతో వేరుగా ఉంటున్నానని చెప్పినా పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా తనను లోబరుచుకున్నాడని ఆరోపించింది. 2 ఏళ్లు మణికొండలో లివింగ్‌ రిలేషన్‌షిప్‌లో ఉండి తన నుంచి రూ.30 లక్షలకు పైగా తీసుకు న్నాడని బాధితురాలు తెలిపింది. ఆర్నెళ్లుగా వేరే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని, ప్రశ్నించడంతో చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. సాయికిరణ్‌ను అరెస్టుచేసి న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement