కాలు తగిలిందని రచ్చ.. బాలిక పరిస్థితి విషమం! | Bobbili RTC Bus Woman Fight For Seat | Sakshi
Sakshi News home page

కాలు తగిలిందని రచ్చ.. బాలిక పరిస్థితి విషమం!

May 1 2026 12:58 PM | Updated on May 1 2026 1:08 PM

Bobbili RTC Bus Woman Fight For Seat

విజయనగరం: దాడితల్లి, సరేపోలమ్మ అమ్మవార్ల పండగకు మేనమామ ఇంటికి  వచ్చిన ఓ బాలి క తిరుగు ప్రయాణంలో బస్సులో మహిళల మధ్య జరిగిన గొడవలో దాడికి గురై తీవ్ర అస్వస్థత పాలైంది. దీంతో స్థానికులు బాలిక ను సీహెచ్‌సీకి 108లో తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయనగ రం కేంద్రాస్పత్రికి తరలించారు. వివరాలు.. 

విశాఖకు చెందిన బెజ్జుపల్లి భార్గవి(14) తల్లి దండ్రులతో కలసి బొబ్బిలిలోని గొల్లవీధిలోని తన మేనమాన ఇంటికి పండగల నిమిత్తం వచ్చింది. పండగ పూర్తయిన సందర్భంగా గురువారం సాయంత్రం తిరిగి విశాఖ వెళ్లేందు కు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లి తల్లిదండ్రులు, తమ్ముడితో కలసి ఆర్టీసీ బస్‌ ఎక్కింది. ఈ సమయంలో సీట్ల కోసం పడుతున్న ఆదుర్దాలో మరో మహిళకు భార్గవి కాలు తగిలింది. దీంతో ఆమె కోపోద్రిక్తురాలై గొడవ పడింది. ఈ గొడవ రెండు సమూహాల మధ్య గొడవగా మారి తోసుకున్నారు. 

ఈ క్రమంలోనే భార్గవిపై ఓ మహిళ పిడిగుద్దులు కురిపించిందనీ, దీంతో బాలిక కిందపడటంతో పలువురు మీది నుంచి వెళ్లిపోయారని బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరాడని పరిస్థితుల్లో 108 ద్వారా స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఏఎస్సై సన్యాసిరావు వెళ్లి వివరాలు సేకరించారు. బాలికను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారని భార్గవి బంధువులు తెలిపారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement