బ్రేకింగ్‌ న్యూస్‌: ఢిల్లీలో పేలుడు..! | Explosion In Delhi, one person died | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌ న్యూస్‌: ఢిల్లీలో పేలుడు..!

Oct 25 2016 12:14 PM | Updated on Sep 4 2017 6:17 PM

బ్రేకింగ్‌ న్యూస్‌: ఢిల్లీలో పేలుడు..!

బ్రేకింగ్‌ న్యూస్‌: ఢిల్లీలో పేలుడు..!

దేశ రాజధాని న్యూఢిల్లీ మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాత ఢిల్లీలోని ఓ వోల్‌సేల్‌ మార్కెట్‌లో పేలుడు సంభవించింది. చాందినీ చౌక్‌ మార్కెట్‌ లేదా నయా బజార్‌గా పేరొందిన ప్రాంతంలో రద్దీ ప్రదేశంలో పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ఈ పేలుడులో ఒకరు మృతిచెందగా.. ఐదుగురు గాయపడ్డారు. దీంతో హుటాహుటీన పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్దసంఖ్యలో టపాసుల కార్ఖానాలు ఉన్నాయి. ఒక బ్యాగులో భారీ ఎత్తున టపాసులు తరలిస్తుండగా అవి ఒక్కసారిగా పేలినట్టు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం తెలుస్తోంది. అయితే, పేలుడు ఎలా జరిగింది? కారణం ఏమిటి? అన్న దానిపై అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ఫోరెన్సిక్‌ నిపుణులు, స్పెషల్‌ సెల్‌ దర్యాప్తు అధికారులు సంఘటనా స్థలం చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ పేలుడు ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement