ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి | erraballi fire on govt officers | Sakshi
Sakshi News home page

ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి

Aug 5 2015 1:54 AM | Updated on Aug 10 2018 8:16 PM

ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి - Sakshi

ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి

‘ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజాసేవ చేయండి. లేదంటే ఏటూరునాగారానికి పంపిస్తా’ అని పాలకుర్తి ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎర్రబెల్లి ...

అధికారులపై ‘ఎర్రబెల్లి’ ఫైర్
 
రాయపర్తి: ‘ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజాసేవ చేయండి. లేదంటే ఏటూరునాగారానికి పంపిస్తా’ అని పాలకుర్తి ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా రాయపర్తి ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఎర్రబెల్లి మాట్లాడారు.

పహానీ, పట్టాల్లో సవరణలు, సర్టిఫికెట్ల జారీ తదితర అంశాల్లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై పలువురు ప్రజాప్రతినిధులు ప్రస్తావించగా, దయూకర్‌రావు మాట్లాడారు. ప్రజా సమస్యలపై అధికారులు సూటిగా స్పందించాలని ఘాటుగా హెచ్చరించారు. అలాకాకుంటే ఏటూరునాగారానికి పంపించేలా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. సమీక్షకు గైర్హాజరైన పలు శాఖల అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement