విరూపాక్ష ఆర్గానిక్స్‌కి ప్రతిష్టాత్మక గుర్తింపు | Virupaksha Organics Receives Prestigious Three Star Export House | Sakshi
Sakshi News home page

విరూపాక్ష ఆర్గానిక్స్‌కి ప్రతిష్టాత్మక గుర్తింపు

May 23 2026 1:01 AM | Updated on May 23 2026 1:01 AM

Virupaksha Organics Receives Prestigious Three Star Export House

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫార్మా దిగ్గజం విరూపాక్ష ఆర్గానిక్స్‌కి తాజాగా ప్రతిష్టాత్మక త్రీ స్టార్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌ గుర్తింపు లభించింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఈ సర్టిఫికెట్‌ జారీ చేసింది. గ్లోబల్‌గా సంస్థ విశ్వసనీయతకి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ప్రస్తుతం తమ కార్యకలాపాల్లో ఎగుమతుల వాటా దాదాపు నలభై శాతం ఉంటోందని సంస్థ ఎండీ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి గంగవరం తెలిపారు. దీన్ని యాభై శాతానికి పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు వివరించారు. ప్రధానంగా యాంటీ అలెర్జిక్, యాంటీ ఫంగల్‌ వంటి ఔషధాల ఎగుమతులు అధికంగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement