సీఈవోను సర్‌ప్రైజ్ చేసిన ఉద్యోగులు! | Employees gift their CEO his dream car | Sakshi
Sakshi News home page

సీఈవోను సర్‌ప్రైజ్ చేసిన ఉద్యోగులు!

Jul 15 2016 3:31 PM | Updated on Sep 4 2017 4:56 AM

సీఈవోను సర్‌ప్రైజ్ చేసిన ఉద్యోగులు!

సీఈవోను సర్‌ప్రైజ్ చేసిన ఉద్యోగులు!

ఆయనో మంచి మనస్సున్న బాస్‌. తన కంపెనీలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులకు జీతాన్ని కళ్లుతిరిగే రీతిలో పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు

ఆయనో మంచి మనస్సున్న బాస్‌. తన కంపెనీలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులకు జీతాన్ని కళ్లుతిరిగే రీతిలో పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఒక్కొక్కరికీ ఏడాదికి కనీసం 70వేల డాలర్లకు(రూ. 46.97 లక్షలు) జీతాన్ని పెంచుతూ ఆయన అసాధారణమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మరీ అంత మంచి బాస్‌కు తమ వంతుగా ఏదైనా చేయాలని ఉద్యోగులు భావించడం భావ్యమే కదా. అందుకే ఆయన కలను నెరవేర్చేందుకు సంకల్పించారు. తమ జీతాల్లో కొంతమొత్తాని దాచిపెట్టి అత్యంత ఖరీదైన కారు 'టెల్సా'ను ఆయనకు కానుకగా ఇచ్చారు.
 

ఈ సర్‌ప్రైజ్ గిఫ్టుతో ఆనందంలో మునిగిపోయారు ఆ సీఈవో.. 'ఇది నిజంగా షాక్ లాంటిదే. దీనిని నేను నమ్మలేకపోతున్నాను.  ఇలాంటిది ఒకటి జరగుతుందని నేను కలలో కూడా అనుకోలేదం'టూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు గ్రేవిటీ కంపెనీ సీఈవో డాన్ ప్రైస్. ప్రైస్ ఇటీవల తన వేతనాన్ని 11 లక్షల డాలర్ల నుంచి 70 వేల డాలర్లకు తగ్గించుకొని.. ఆ మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలకు బదలాయించారు. గ్రేవిటీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కనీసం ఏడాదికి 70వేల డాలర్ల జీతం ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయం వ్యాపార ప్రపంచంలో విస్మయం కలిగింది.

మరోవైపు గ్రేవిటీ కంపెనీలో 30శాతం వాటా కలిగిన సోదరుడి నుంచే ఆయన కేసు ఎదుర్కొంటున్నారు. గ్రేవిటీ కంపెనీ సీఈవో అయిన ప్రైస్ ఎక్కువ వేతనాన్ని పొందుతున్నాడని ప్రధాన వాటాదారుడైన ఆయన సోదరుడు కేసు వేశాడు. ఈ కేసు కొలిక్కివచ్చే దశలో ఉండటంతో గ్రేవిటీ ఉద్యోగులు ఊహించనిరీతిలో తమ బాస్ కలల కారును కానుకగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement