ఎలిజబెత్ హర్లీ ముద్దు ఖరీదు రూ. 48 లక్షలు! | Elizabeth Hurley's kiss sells for USD 81,000 | Sakshi
Sakshi News home page

ఎలిజబెత్ హర్లీ ముద్దు ఖరీదు రూ. 48 లక్షలు!

Sep 6 2014 11:33 PM | Updated on Sep 2 2017 12:58 PM

ఎలిజబెత్ హర్లీ ముద్దు ఖరీదు రూ. 48 లక్షలు!

ఎలిజబెత్ హర్లీ ముద్దు ఖరీదు రూ. 48 లక్షలు!

బహిరంగంగానే ఇలా గాఢ అధర చుంబనంలో మునిగిపోయిన వీరిద్దరూ ఇంగ్లాండ్ మోడల్ కమ్ నటీమణి ఎలిజబెత్ హర్లీ, ఇండో కెనెడియన్ వ్యాపారవేత్త జూలియన్ భారతీలు.

లాస్ ఏంజిల్స్ : బహిరంగంగానే ఇలా గాఢ అధర చుంబనంలో మునిగిపోయిన వీరిద్దరూ ఇంగ్లండ్ మోడల్ కమ్ నటీమణి ఎలిజబెత్ హర్లీ, కెనడా బిలినీయర్ కుమారుడైన ఇండో కెనడియన్ వ్యాపారవేత్త  జూలియన్ భారతీలు. కెనడాలోని విండ్సర్ నగరంలో నిర్వహించిన వుడ్‌సైడ్ ఎండ్ సమ్మర్ పార్టీలో ఈ 49 ఏళ్ల సుందరి తన ముద్దును వేలం వేయగా.. 27 ఏళ్ల జూలియన్ ఏకంగా 81 వేల డాలర్ల(రూ. 48 లక్షలు)కు సొంతం చేసుకున్నాడు.

 

అయితే... ఈ ముద్దు వేలం వేసింది డబ్బు సంపాదించడం కోసం కాదండోయ్.. ఓ సేవా కార్యక్రమానికి నిధుల కోసం. ఈమె ముద్దు వేలం ద్వారా వచ్చిన డబ్బును ఎల్టన్ జాన్స్ ఎయిడ్స్ ఫౌండేషన్‌కు అందింది. అందుకే మరి.. భారీ మొత్తం చెల్లించి ముద్దును కొనుక్కున్నా.. జూలియన్ భార్య క్రిస్టీ కూడా ఫీలవ్వలేదట. జులియన్-క్రిస్టీల జంటకు ముగ్గురు పిల్లలు.

Advertisement
 
Advertisement
Advertisement