ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం | Eight years girl raped by adult | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం

Aug 17 2015 5:54 PM | Updated on Sep 26 2018 3:36 PM

ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు కర్కశంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

గుంటూరు క్రైమ్: ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు కర్కశంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా నర్సారావుపేట రూరల్ మండలం లింగంకుంట గ్రామంలోని యానాది కాలనీ సమీపంలో ఈ దారుణం జరిగింది. సోమవారం సాయంత్రం బాలిక పుట్టగొడుగుల కోసం కాలనీ నుంచి బయటకు రాగా, అదే కాలనీకి చెందిన గుడిపూడి వెంకటేశ్వర్లు(55) ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.

వంటి నిండా కొరికిన, రక్కిన గాయాలతో బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడంతోపాటు బాధిత బాలికను చికిత్స కోసం నర్సారావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement