ఎకానమీ మళ్లీ పుంజుకుంటుంది: ప్రణబ్ | Economy gaining again: Pranab | Sakshi
Sakshi News home page

ఎకానమీ మళ్లీ పుంజుకుంటుంది: ప్రణబ్

Sep 15 2013 1:44 AM | Updated on Sep 1 2017 10:43 PM

ఎకానమీ మళ్లీ పుంజుకుంటుంది: ప్రణబ్

ఎకానమీ మళ్లీ పుంజుకుంటుంది: ప్రణబ్

దేశ ఆర్థిక వ్యవస్థ గురించి నిరాశచెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే మళ్లీ పుంజుకోగలదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు


 కోల్‌కతా: దేశ ఆర్థిక వ్యవస్థ గురించి నిరాశచెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే మళ్లీ పుంజుకోగలదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ఈ దిశగా పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు, ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. శనివారం జరిగిన బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
 
 రూపాయి మారకం విలువను స్థిరీకరించడంపైనే ప్రస్తుతం విధానకర్తలు ప్రధానంగా దృష్టి సారించారని ప్రణబ్ చెప్పారు.   ఈసారి వర్షపాతం మెరుగ్గా ఉండటం వ్యవసాయరంగ వృద్ధిపైన, ఆహార వస్తువుల ధరలపైనా సానుకూల ప్రభావం చూపగలదని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement