డంపింగ్ యార్డ్‌లో పులి చర్మం.. | Dumping Yard in tiger skin! | Sakshi
Sakshi News home page

డంపింగ్ యార్డ్‌లో పులి చర్మం..

Dec 4 2015 3:42 AM | Updated on Sep 29 2018 5:47 PM

డంపింగ్ యార్డ్‌లో పులి చర్మం.. - Sakshi

డంపింగ్ యార్డ్‌లో పులి చర్మం..

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు డంపింగ్‌యార్డ్ ప్రాంతంలో గురువారం ప్లాస్టిక్ కవర్లో పులి చర్మం లభించింది.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు డంపింగ్‌యార్డ్ ప్రాంతంలో గురువారం ప్లాస్టిక్ కవర్లో పులి చర్మం లభించింది. స్థానికులు గుర్తించి కవర్లో నుంచి చర్మాన్ని బయటకు తీసి పరిశీలించారు. దీని పొడవు ఐదడుగులు ఉంది. మరోచోట పులిచర్మం చీకిపోయిన ముక్కలు కనిపించాయి. దీంతో వారు ఈ విషయాన్ని గూడూరు రూరల్ పోలీసులకు తెలియజేశారు. వారు పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ. లక్షల విలువజేసే పులి చర్మాన్ని తమ వద్ద ఉంచుకుంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద జైలుపాలవుతామని ఎవరైనా అక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.     -గూడూరు

Advertisement
 
Advertisement
Advertisement