డెంటల్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచార యత్నం | Dental student raped by junior in vijayawada | Sakshi
Sakshi News home page

డెంటల్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచార యత్నం

Sep 6 2015 11:48 AM | Updated on Jul 28 2018 8:53 PM

డెంటల్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచార యత్నం - Sakshi

డెంటల్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచార యత్నం

విజయవాడ నగరంలోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థినిపై థర్డీయర్ విద్యార్థి శ్రీధర్ లైంగికదాడికి యత్నించారు.

విజయవాడ: విజయవాడ నగరంలోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థినిపై థర్డీయర్ విద్యార్థి శ్రీధర్ లైంగికదాడికి యత్నించారు. ఈ సంఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సదరు విద్యార్థిని తన స్నేహితురాలితో కలసి శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఉంటోంది. అయితే శ్రీధర్ గత రాత్రి బాగా మద్యం సేవించి విద్యార్థిని ఉంటున్న గదికి వచ్చి తలుపు కొట్టాడు.

తలుపు తీసిన ఆమెపై పడి... అమాంతంగా అత్యాచారం చేయడోయాడు. అతడి నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకుని బయటపడి... పటమట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా శ్రీధర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement