మొరగొద్దని కుక్కను ఆదేశించిన కోర్టు | Croatian Court Bans Dog From Barking | Sakshi
Sakshi News home page

మొరగొద్దని కుక్కను ఆదేశించిన కోర్టు

Feb 10 2015 9:29 PM | Updated on Sep 29 2018 3:55 PM

మొరగొద్దని కుక్కను ఆదేశించిన కోర్టు - Sakshi

మొరగొద్దని కుక్కను ఆదేశించిన కోర్టు

మొరగటమే ఆ కుక్క పాలిట నేరంగా మారింది. ఇకపై నిర్దేశించిన సమయాల్లోనే మొరగాలని ఆ శునకాన్ని కోర్టు ఆదేశించిన విచిత్ర సంఘటన క్రొయేషియాలో జరిగింది.

పెరెజైఉ(క్రొయేషియా): మొరగటమే ఆ కుక్క పాలిట నేరంగా మారింది. ఇకపై నిర్దేశించిన సమయాల్లోనే మొరగాలని ఆ శునకాన్ని కోర్టు ఆదేశించిన విచిత్ర సంఘటన క్రొయేషియాలో జరిగింది. క్రొయేషియా దేశంలోని పెరెజ్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో ఆంటన్ సిమునోవిక్‌కు ఓ కుక్క ఉంది. దాని పేరు మెడో(3).

అది రాత్రి వేళల్లో అకారణంగా మొరుగుతుండటంతో విసిగిపోయిన పొరుగింటాయన... సిమునోవిక్‌కు మొరపెట్టుకున్నాడు. కుక్క గోల కారణంగా నిద్ర కరువైందని ఆవేదన వ్యక్తం చేశాడు. పాపం... ఆ యజమాని మెడోను అరవకుండా చేయాలని శతథా ప్రయత్నించాడు. కానీ, ఫలితం లేకపోయింది. దీంతో సదరు బాధితుడు పెరెజ్ లోని కోర్టును ఆశ్రయించాడు. కుక్కకారణంగా తాను పడుతున్న బాధను వివ రించాడు.

ఆయన  ఆవేదనను అర్థం చేసుకున్న న్యాయమూర్తి...బోనెక్కిన ఆ కుక్కను.. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు తన గదిలోనే ఉండాలని, ఆరు బయట తిరగరాదని ఆదేశించారు. లేకుంటే సదరు యజమాని జరిమానాగా మూడు వేల డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement